జలాంతర్గాముల నుండి ప్రయోగించడానికి వీలయ్యే బాలిస్టిక్ క్షిపణిని జలాంతర్గామి నుండి ప్రయోగించే బాలిస్టిక్ క్షిపణి అంటారు. ఈ క్షిపణుల ఆధునిక రూపాలు మిర్వ్ సామర్థ్యం, అణు సామర్థ్యమూ కలిగి ఉంటాయి. మిర్వ్ సామర్థ్యంతో ఒకే ఒక్క క్షిపణి ప్రయోగంతో అనేక లక్ష్యాలను ఏక కాలంలో ఛేదించగలిగే అవకాశం ఉంటుంది. జలాంతర్గామి నుండి ప్రయోగించే క్రూయిజ్ క్షిపణుల కంటే ఇవి విభిన్నంగా ఉంటాయి.
ఇవి ఖండాంతర బాలిస్టిక్ క్షిపణుల (5,500 కి.మీ. పైబడిన పరిధి) లాగానే పనిచేస్తాయి. చాలా సందర్భాల్లో ఈ రెండు రకాల క్షిపణులు కూడా ఒకే క్షిపణి కుటుంబానికి చెంది ఉంటాయి.
బాలిస్టిక్ క్షిపణి జలాంతర్గాములు అణుపాటవం గల దేశాలకు వ్యూహాత్మకంగా చాలా ముఖ్యమైనవి. ఇవి నిఘా ఉపగ్రహాల కంటబడకుండా ఉంటూ, తమ అణ్వాయుధాలను ప్రయోగించగలవు. శత్రుదేశాల అణుదాడిలో నేలపై ఉండే అణ్వాయుధాలన్నీ నాశనమైనా, ఈ తొలిదాడిని తప్పించుకుని, విధ్వంసకమైన ప్రతిదాడి చేసే సామర్థ్యాన్ని ఇవి కలిగి ఉంటాయి. దీంతో, ఏమాత్రం సందేహం వచ్చినా అణ్వాయుధాలను ప్రయోగించేందుకు సిద్ధంగా ఉండాల్సిన అవసరం, తత్కారణంగా ప్రమాదవశాత్తూ అణుయుద్ధం మొదలయ్యే అవకాశం తొలగి పోయింది. ఎంతో నిశ్శబ్దంగా ఉండే ఈ జలాంతర్గాములపై, ఎంతో కచ్చితత్వం గల క్షిపణులను మోహరించడం ద్వారా, శత్రుదేశ తీరానికి దగ్గరగా వెళ్ళి, తక్కువ ఎత్తు గల బాలిస్టిక్ పథంలో క్షిపణిని ప్రయోగించి, తొలిదాడి జరిగిన తరువాత అతి తక్కువ సమయంలో, అత్యంత కచ్చితత్వంతో ప్రతిదాడిని చెయ్యవచ్చు. అలాగే ఈ ప్రతిదాడి ద్వారా శత్రుదేశపు రాజకీయ, సైనిక నాయకత్వాన్ని పూర్తిగా నిర్మూలించగలిగే సామర్థ్యమూ వీటికి ఉంది.
రకాలు
జలాంతర్గామి నుండి ప్రయోగించే బాలిస్టిక్ క్షిపణులు (గత, ఇప్పటి, అభివృద్ధిలో ఉన్న) ఇవి:
రకం
నాటో పిలిచే పేరు
కనిష్ట పరిధి (కి.మీ.)
గరిష్ఠ పరిధి (కి.మీ.)
దేశం
స్థితి
UGM-27 పోలారిస్ (A-1 నుండి A-3 దాకా)
4,600
అమెరికా
మోహరింపు నుండి తొలగించారు
UGM-73 పోసీడాన్ (C-3)
4,600
అమెరికా
మోహరింపు నుండి తొలగించారు
UGM-96 ట్రైడెంట్ I (C-4)
7,400
అమెరికా
మోహరింపు నుండి తొలగించారు
UGM-133 Trident II (D5LE)
12,000
అమెరికా
మోహరించారు
R-13
SS-N-4
600
సోవియట్ యూనియన్/రష్యా
మోహరింపు నుండి తొలగించారు
R-21
SS-N-5
1,650
సోవియట్ యూనియన్/రష్యా
మోహరింపు నుండి తొలగించారు
R-27
SS-N-6
2,400
3,000
సోవియట్ యూనియన్/రష్యా
మోహరింపు నుండి తొలగించారు
RSM-40 R-29 "వైసోటా"
SS-N-8 "Sawfly"
7,700
9,000
సోవియట్ యూనియన్/రష్యా
మోహరింపు నుండి తొలగించారు
R-27K
SS-NX-13
3,600
సోవియట్ యూనియన్/రష్యా
Never మోహరించారు
RSM-45 R-31
SS-N-17 "Snipe"
4,500
సోవియట్ యూనియన్/రష్యా
మోహరింపు నుండి తొలగించారు
RSM-50 R-29R "వైసోటా"
SS-N-18 "Stingray"
6,500
సోవియట్ యూనియన్/రష్యా
మోహరింపు నుండి తొలగించారు
RSM-52 R-39 "Rif"
SS-N-20 "Sturgeon"
8,300
సోవియట్ యూనియన్/రష్యా
మోహరింపు నుండి తొలగించారు
RSM-54 R-29RM "ష్టిల్"
SS-N-23 "Skiff"
8,300
సోవియట్ యూనియన్/రష్యా
మోహరింపు నుండి తొలగించారు (Under rebuild to R-29RMU "Sineva")
RSM-54 R-29RMU "సినేవా"
SS-N-23 "Skiff"
8,300
సోవియట్ యూనియన్/రష్యా
మోహరించారు
RSM-54 R-29RMU2 "లేనర్"
8,300
12,000
సోవియట్ యూనియన్/రష్యా
మోహరించారు
RSM-56 R-30 "బులావా"
SS-NX-32
8,000
8,300
సోవియట్ యూనియన్/రష్యా
మోహరించారు
UGM-27 Polaris (A-3) and Chevaline
4,600
United Kingdom
మోహరింపు నుండి తొలగించారు
UGM-133 Trident II (D5)
12,000
United Kingdom
మోహరించారు
M1
3,000
ఫ్రాన్సు
మోహరింపు నుండి తొలగించారు
M2
3,200
ఫ్రాన్సు
మోహరింపు నుండి తొలగించారు
M20
3,000
ఫ్రాన్సు
మోహరింపు నుండి తొలగించారు
M4
5,000
ఫ్రాన్సు
మోహరింపు నుండి తొలగించారు
M45
6,000
ఫ్రాన్సు
మోహరించారు
M51
8,000
10,000
ఫ్రాన్సు
మోహరించారు
JL-1
2,500
చైనా
మోహరింపు నుండి తొలగించారు (never fully మోహరించారు)
JL-2
7,400
8,000
చైనా
మోహరించారు
JL-3
11,000
చైనా
పరీక్షిస్తున్నారు
K-15 సాగరిక
750
1,900
భారత్
మోహరించారు
K-4
3,500
భారత్
అరిహంత్ తరగతి జలాంతర్గామి నుండి పరీక్షించారు.
K-5
6,000
భారత్
అభివృద్ధి జరుగుతోంది
పుక్కుక్సాంగ్-1/KN-11
500
2,500
ఉత్తర కొరియా
అభివృద్ధి జరుగుతోంది
సైనికేతర వినియోగం
కొన్ని రష్యా జలాంతర్గామి నుండి ప్రయోగించే బాలిస్టిక్ క్షిపణులను ఉపగ్రహ వాహకనౌకలుగా మార్చారు.